ఆరు నేషనల్​ హైవేస్​ జాతికి అంకితం

ఆరు నేషనల్​ హైవేస్​ జాతికి అంకితంహైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 13,169 కోట్లతో 766 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ, సీఎం కేసీఆర్​ , కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జాతికి అంకితం చేశారు. మరో 8 నూతన రహదారులకు భూమిపూజ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్‌లోని ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ను ప్రారంభించారు. దీంతోపాటు సూర్యాపేట-నల్లగొండ జిల్లాల్లో నిర్మించిన రోడ్లు, వికారాబాద్‌-నారాయణ్‌పేట జిల్లాల్లో, హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి మెదక్‌ రూటును, ఆత్మకూర్‌-పరసా సెక్షన్‌లో 34 కి.మీ. మేర నిర్మించిన రోడ్డు, మహదేవ్‌పూర్‌-భూపాలపల్లి సెక్షన్‌లో కొత్తగా నిర్మించిన రోడ్లను గడ్కరీ జాతికి అంకితం చేశారు. అదేవిధంగా సూర్యాపేట-ఖమ్మం, మంచిర్యాల-రేపల్లెవాడ, రామ్సన్‌పల్లె-మంగళూరు, కంది-రామ్సన్‌పల్లెతోపాటు మరికొన్ని రహదారుల పనులకు శంకుస్థాన చేశారు. ‘రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును సీఎం కేసీఆర్‌ ప్రోత్సహించడంపై సంతోషంగా ఉందన్నారు ’కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపి పలు విజ్ఞప్తులు చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వం తరుపున రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘దేశంలోనే యంగస్ట్ స్టేట్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో మిగిలిన మరికొన్ని జాతీయ రహదారులను కూడా ప్రారంభించాలని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి కేంద్రం మంత్రి నితిన్​ గడ్కరీని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు శ్రీ బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

శంకుస్థాపన చేసిన రోడ్ల వివ‌రాలు :

నాలుగు లేన్ల రహదారి సూర్యాపేట – ఖమ్మం
(58.62 కి.మీ పొడవు – 2 వేల 54 కోట్ల విలువ )

నాలుగు లేన్ల రహదారి మంచిర్యాల – రేపల్లెవాడ
(42 కి.మీ పొడవు – 1 వేయి 5 వందల 56 కోట్ల విలువ )

నాలుగు లేన్ల రహదారి రామ్ సాన్ పల్లె – మంగ్లూర్
(46.808 కి.మీ పొడవు – 1 వేయి 5 వందల 51 కోట్ల విలువ )

నాలుగు లేన్ల రహదారి కంది – రాం సాన్ పల్లె
(39.98 కి.మీ పొడవు – 1 వేయి 3 వందల 4 కోట్ల విలువ )

నాలుగు లేన్ల రహదారి మంగ్లూర్ నుంచి తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్ వరకు
(48.96 కి.మీ పొడవు – 1 వేయి 2 వందల 47 కోట్ల విలువ )

నాలుగు లేన్ల రహదారి రేపల్లెవాడ నుంచి తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్ వరకు
(52.602 కి.మీ పొడవు – 1 వేయి 2 వందల 26 కోట్ల విలువ )

పునరావాసం మరియు అభివ్రుద్ది నకిరేకల్ – నాగార్జునసాగర్
(85.45 కి.మీ పొడవు – 3 వందల 69 కోట్ల విలువ )

రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) కంకాపూర్ – ఖానాపూర్ రహదారి
(21.10 కి.మీ పొడవు – 1 వంద 41 కోట్ల విలువ )

జాతికి అంకితం ఇచ్చిన రోడ్ల వివరాలు :

నాలుగు లేన్ల రహదారి యదాద్రి – వరంగల్
(99 కి.మీ పొడవు –1 వేయి 8 వందల 89 కోట్ల విలువ)

రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) నకిరేకల్ – తానంచెర్ల రహదారి
(66 కి.మీ పొడవు – 6 వందల 5 కోట్ల విలువ)

పునరావాసం మరియు అభివృదిధ చేసిన ఓ.ఆర్.ఆర్. –మెదక్ రహదారి
(62 కి.మీ పొడవు – 4 వందల 26 కోట్ల విలువ)

రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) మన్నెగూడ – రావులపల్లి రహదారి
(72 కి.మీ పొడవు – 3 వందల 59 కోట్ల విలువ)

రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) ఆత్మకూరు – పస్ర రహదారి
(34 కి.మీ పొడవు – 2 వందల 30 కోట్ల విలువ)

రెండు లేన్ల ( 10 మీటర్ల వెడల్పు ) మహాదేవపూర్ – భూపాలపల్లి రహదారి
(33 కి.మీ పొడవు – 2 వందల 6 కోట్ల విలువ)