వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: శ్రీ మేడారం సమ్మక్క –సారలమ్మ జాతరను పురస్కరించుకొని సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. జాతర కవరేజి నిమిత్తం వచ్చిన ప్రింట్ ఆండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సహాయ సంచాలకులు బి. లక్ష్మణ్ ను కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
ఇంటర్నెట్, భోజనం వసతుల కల్పనలో కూడా పాత్రికేయులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. అనంతరం మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ లను, వంటగదిని పరిశీలించారు. అన్ని ఏర్పాట్లను చూసి సమాచార శాఖ అధికారులందరిని, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారులు భూపాలపల్లి, వరంగల్ డీపీఆర్ఓ లు బి.రవి కుమార్, బండి పల్లవి, ఎఆర్ఇ పి. భూపాల్, ములుగు డీపీఆర్ఓ బి. ప్రేమలత, ఏవిఎస్ కె. రామ చంద్రరాజు, ఏపీఆర్ఓ యం.డి. రఫీక్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.