మేడారం హుండీ ఆదాయం..రూ.11 కోట్ల 44 లక్షలు

మేడారం హుండీ ఆదాయం..రూ.11 కోట్ల 44 లక్షలు

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఈసారి హుండీల ఆదాయం రూ.11 కోట్ల 44 లక్షలు 12వేల 707 రూపాయలు వచ్చింది. బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోల 350 గ్రాములు లభ్యమైంది. చిల్లర నాణేల రూపంలో 37 లక్షలు సమకూరాయి. 2020 జాతర కంటే ఈసారి మేడారం హుండీ ఆదాయం తగ్గింది. గత జాతరలో రూ.11 కోట్ల 64 లక్షల ఆదాయం, బంగారం ఒక కేజీ 63 గ్రాముల 900 మిల్లీలు, వెండి 53 కేజీల 450 గ్రాములు భక్తులు కానుకలుగా సమర్పించారు.మేడారం హుండీ ఆదాయం..రూ.11 కోట్ల 44 లక్షలు