నేటికీ మహిళలకు గౌరవం దక్కడం లేదు : తమిళిసై

నేటికీ మహిళలకు గౌరవం దక్కడం లేదు : తమిళిసై

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరికి అత్యున్నత పదవిలో ఉన్న వారు సైతం సరైన గౌరవం పొందడం లేదని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. తననెవరూ భయపెట్టలేరని, తాను దేనికి భయపడనని స్పష్టం చేశారు. రాజ్​భవన్​లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్​ మాట్లాడారు. ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని, ప్రతీదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందని గవర్నర్​ తెలిపారు. నేటికీ మహిళలకు గౌరవం దక్కడం లేదు : తమిళిసైస్త్రీలందరూ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని చెప్పారు. భవిష్యత్తు కోసం పొదుపు పాటించాలని చెప్పారు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా ప్రతీ అడుగూ నూతనోత్సహంతో ముందుకు సాగాలని చెప్పారు. మహిళలకు పలు సూచనలు చేస్తూ ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సందర్భంగా తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల తనను ఓ ఇంటర్వ్యూలో అడిగారని తమిళిసై అన్నారు. అందరూ ఒకేలా ఉంటారని సమాధానం చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ సోదరిగా తాను ఇక్కడి మహిళల జీవన విధానాన్నిఎంతగానో ఇష్టపడతానని గవర్నర్​ వెల్లడించారు. మహిళలు ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించాలని గవర్నర్ కోరారు.