8వ నిజాం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు సిద్దం
వరంగల్ టైమ్స్, ఇస్తాంబుల్ : టర్కీలోని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి మరణించిన ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ ముకరం ఝా బహదూర్ భౌతికకాయాన్ని ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో ఖననం చేయనున్నారు.
మక్కా మసీద్‌లో ఖననం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనవడైన ముఖరం ఝా 8వ నిజాంగా పరిగణించబడుతున్నారు. ఆయన భౌతికకాయం ఈరోజు హైదరాబాద్‌కు వస్తోంది. ఛార్టర్డ్ విమానంలో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్లో ప్రజల సందర్శనం కోసం ఉంచుతారు. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న జన్మించిన ముఖరం ఝా 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా అధికారికంగా పిలవబడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు.