పేపర్ లీక్ పై 48గంటల్లో నివేదికివ్వాలి: తమిళిసై
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. సమగ్ర దర్యాప్తు జరిపి 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాల్సిందిగా ఆమె కోరారు.