విజయరామారావు పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి

విజయరామారావు పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి

విజయరామారావు పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మాజీ మంత్రి, దివంగత కె.విజయరామారావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. వారి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు, కూతురు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో వున్న వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అధికారికంగా జరుగుతున్న అంత్యక్రియలకు సంబంధించి జరగాల్సిన ఏర్పాట్ల గురించి సీఎం ఆరాతీశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, నారదాసు, డీజీపీ అంజనీ కుమార్, కమిషనర్ సి.వి.ఆనంద్ తదితరులు నివాళులర్పించారు.