ముగ్గురు పోలీస్ అధికారులు సస్పెండ్

ముగ్గురు పోలీస్ అధికారులు సస్పెండ్

వరంగల్ టైమ్స్, క్రైమ్ డెస్క్ :వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్సెస్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వెంకటేశ్వర్లు, దామెర పోలీస్ స్టేషన్ ఎస్సై ఎ.హరిప్రియ, సుబేదారిఎస్సై పి.పున్నం చందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు.ముగ్గురు పోలీస్ అధికారులు సస్పెండ్ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్సై హరిప్రియ ఇరువురు గత కొద్ది రోజులుగా హద్దులు మీరి వ్యవహరించడంతో మహిళా ఎస్సై భర్త ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అనంతరం పోలీస్ కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు, మహిళ ఎస్సై హరిప్రియ లను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

మరో సంఘటనలో సుబేదారిలో నివాసం వుంటున్న ఓ యువతి గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు
గురికావడంతో రక్షణ కోసం సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.పున్నంచందర్ ను ఆశ్రయించగా సదరు ఎస్సై నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిందితుడితో రాజీపడాల్సిందిగా బాధితురాలికి ఎస్సై సూచించినట్లుగా సమాచారం. ఈ మేరకు వచ్చిన పిర్యాదుపై ఎస్సై సుబేదారిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.