స్వీట్లు పంచుకున్న గ్రామస్థులు..ఎందుకో తెలుసా !

స్వీట్లు పంచుకున్న గ్రామస్థులు..ఎందుకో తెలుసా !

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కారణాల వల్ల ముగ్గురు పోలీస్ అధికారులను వరంగల్ సీపీ రంగనాథ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ అధికారుల సస్పెన్షన్ స్థానిక ప్రజల్లో సంతోషాన్ని కలుగచేసింది.

వివరాల్లోకి వెళితే.. వరంగల్ సీపీ రంగనాథ్ సస్పెండ్ చేసిన ముగ్గురు పోలీసు అధికారుల్లో వరంగల్ జిల్లా గీసుకొండ సీఐ కూడా ఉన్నాడు. కొన్ని ఆరోపణల రీత్యా అతన్ని విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. సీఐ సస్పెండ్ సమాచారం తెలుసుకున్న మనుగొండ గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వినూత్న రీతిలో టపాసులు కాలుస్తూ ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మరోవైపు రాత్రంగా గ్రామ ప్రజలంతా ఒక్కచోట చేరి మిఠాయిలు సైతం పంచుకున్నారు. ఇది తమకు ఒక శుభ సందర్భం అని గ్రామప్రజలు చెప్పుకోవడం గమనార్హం.స్వీట్లు పంచుకున్న గ్రామస్థులు..ఎందుకో తెలుసా !

వరంగల్ సీపీ సూపర్ మార్క్ ..
వరంగల్ సీపీ రంగనాథ్ అంటేనే అక్రమార్కుల గుండెల్లో దడపుట్టించే పోలీస్ అధికారిగా ఒక మార్క్ ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ను వేసుకున్నారు. ఎక్కడ విధులు నిర్వర్తించినా తన నైజం మారదంటూ వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పనిచేసినప్పుడు సొంత శాఖలోని అక్రమార్కులకు దడపుట్టించారు. ఇప్పుడు వరంగల్ లోనూ అదే మార్క్ చూపుతున్నారు.

ప్రజా ఫిర్యాదులపై నిఘా విభాగం అధికారులతో విచారణ జరిపి వేటు వేస్తున్నారు. పోలీస్ శాఖలో ఉంటూ భూదందాలు, అక్రమ వ్యాపారాలు చేసే వారి పట్ల కొరఢా ఝులిపిస్తున్నారు. తాజాగా అక్రమ సంబంధం నేపథ్యంలో జనవరి 3వ తేదీన గీసుకొండ సీఐ, దామెర ఎస్సైని, మరో కారణంతో ఇంకో పోలీస్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోలీసు అధికారుల సస్పెన్షన్ స్థానికంగా ప్రజల్లో సంతోషాన్ని నింపింది. అక్రమార్కులపై కొరఢా ఝులిపించిన సీపీ తీరుపై ప్రజలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.