అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ

అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చఅసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 6న మంత్రి హరీష్ రావు 2023-2024కు గాను వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్దులపై సభలో గురువారం చర్చ ప్రారంభమైంది.

నేడు పరిశ్రమలు, సమాచార-పౌరసంబంధాలు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, ఇంధన, అటవీ, కార్మిక, దేవాదాయ, న్యాయ, విద్యాశాఖకు చెందిన మొత్తం 12 పద్దులపై చర్చ జరుపనున్నారు. భద్రాచాలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటు కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఇక ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆసరా పింఛన్లు, ఆయిల్ పాము సాగు, పోడు భూముల సమస్య, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, మెడికల్ కాలేజీలు, షీటీమ్స్ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. సభ్యుల ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమివ్వనున్నారు.