మాగుంటకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాదిన పలువురి అరెస్ట్
ఇటీవల మాగుంట రాఘవను అదుపులోకి తీసుకున్న ఈడీ
నేటితో ముగిసిన ఈడీ కస్టడీ
మార్చి 4 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇటీవల అరెస్ట్ చేయడం తెలిసిందే. మాగుంట రాఘవను కోర్టులో హాజరుపరుచగా 10 రోజుల కస్టడీ విధించారు. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో మాగుంట రాఘవను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
దాంతో ఆయనకు న్యాయస్థానం మార్చి 4 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ నేపథ్యంలో మాగుంట రాఘవను ఢిల్లీ తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ క్రియాశీలకంగా వ్యవహరించిందని, ఈ గ్రూప్ లో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్ర, ఎమ్మెల్సీ కవితలతో పాటు మాగుంట రాఘవ కూడా కీలకపాత్ర పోషించాడని ఈడీ అధికారులు చార్జిషీటులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.