ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నందమూరి తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిసాయి. తండ్రి మోహనకృష్ణ కుమారుడికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. హైదరాబాద్ లోని తారకతర్న ఇంటికి  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు, నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులు, ఎంపీ విజయసాయి రెడ్డి, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా పలువురు కుటుంబసభ్యులు హాజరయ్యారు. తారకరత్న పార్థివ దేహానికి నివాళులర్పించారు.ముగిసిన తారకరత్న అంత్యక్రియలుఉదయం ఫిలిం ఛాంబర్ నుంచి వైకుంఠ రథంలో తారకరత్న పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. వైకుంఠరథం వాహనంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, పలువురు కుటుంబసభ్యులు ఉన్నారు. తారకరత్నకు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహాప్రస్థానానికి చేరిన అనంతరం తారకరత్న భౌతికకాయాన్ని బాలకృష్ణ సహా, నందమూరి కుటుంబసభ్యులు మోసారు. కుటుంబసభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు ముగిసాయి.