మేడారం సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి

మేడారం సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవత సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య (38) మృతి చెందారు. నిన్న రాత్రి తెల్లవారు జామున 3 గంటల సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో బంధువులు మేడారం నుండి ఏటూరునాగారంలోని సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాంబయ్యను పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.మేడారం సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి