ములుగులో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ములుగులో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనంములుగులో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు,రైతుబంధు నిలిపివేయాలంటూ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ములుగు మండల ఎన్నికల ఇన్‌చార్జి,తెలంగాణ రెడ్ కో చైర్మన్ వై.సతీష్‌రెడ్డి అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ కుట్ర చేయడం అంటే రైతులను అన్యాయం చేయడమేనని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలు మాని రైతుల మేలుకు సహకరించాలని అన్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా..గత సంక్షేమ పథకాలు కొనసాగించవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పినా రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో అదరణ పొందుతున్నాయన్న అక్కసుతోనే రేవంత్‌రెడ్డి కుట్రలకు తెర లేపారని,కుట్రతో ప్రజల్లో దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ములుగు మండల ఎంపీపీ శ్రీదేవి సుధీర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, దివంగత మాజీ మంత్రి చందులాల్ తనయుడు ధరమ్ సింగ్, నాయకులు శరత్, విజయ్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యర్తలు భారీగా పాల్గొన్నారు.