పీజీ మెడికల్ ప్రవేశాలకు మాప్ అప్ నోటిఫికేషన్

పీజీ మెడికల్ ప్రవేశాలకు మాప్ అప్ నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ హెల్త్ యూనిరవ్సిటీ పరిధిలోని కాలేజీలకు అదే విధంగా నిమ్స్ మెడికల్ కాలేజీలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పీజీ కటాఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో సర్వీస్ కేటగిరి అభ్యర్థులకు ఈ సారి అవకాశం కల్పించారు. సర్వీస్ , నాన్ సర్వీస్ సీట్ల ఖాళీల వివరాలను యూనిర్సిటీ వైబ్ సైట్ లో పొందుపరిచారు.

ఈ నెల 23న ఉదయం 6గంటల నుంచి 24న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనవర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.