నీట్ పీజీ సెట్ లో మెరిసిన శ్రీకాకుళం స్టూడెంట్స్ 

నీట్ పీజీ సెట్ లో మెరిసిన శ్రీకాకుళం స్టూడెంట్స్

వరంగల్ టైమ్స్, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలో నీట్‌ పీజీ సెట్‌లో విద్యార్థులు ప్రభంజనం సష్టించారు. మండలంలోని సుందరాడ గ్రామానికి చెందిన నీవగాన కిరణ్‌, నీలిమ ఉత్తమ ర్యాంకులు సాధించారు. నీలిమ ఆల్‌ ఇండియా స్థాయిలో 600 ర్యాంకు సాధించగా, కిరణ్‌ 8200 ర్యాంకు సాధించారు. వీరిద్దరూ పాతపట్నంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌ విజయవాడలోని శ్రీ చైతన్యలో చదివారు. ఎంబిబిఎస్‌ విశాఖలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో చదివారు. తండ్రి పాపారావు కోడూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచి ర్యాంకులు సాధించడంపై తల్లిదండ్రులతో ఆపటటు, గ్రామస్తులు అభినందించారు. మెళియాపుట్టికి చెందిన సాయి వివేక్‌ 319వ ర్యాంకు సాధించాడు. ఈయన గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలోఎంబిఎస్‌ చేశారు.