కఛ్చితంగా ఏడు సీట్లు గెలవాల్సిందే : జగన్ 

కఛ్చితంగా ఏడు సీట్లు గెలవాల్సిందే : జగన్

కఛ్చితంగా ఏడు సీట్లు గెలవాల్సిందే : జగన్ వరంగల్ టైమ్స్, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రుల్లో టెన్షన్ – కచ్చితంగా ఏడు సీట్లు గెలవాల్సిందేనని సీఎం ఆదేశించారు. తేడావస్తే పదవులు ఉండవని మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చాడు. నలుగురు ఎమ్మెల్యేలు చేజారినా బరిలో టీడీపీ అభ్యర్థి – మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను నిలబెట్టిన విపక్షపార్టీ – వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‍లో ఉన్నారంటూ చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలు ఓటేస్తే టీడీపీ గెలుస్తుందన్న ధీమా టీడీపీ అధినాయత్వానికి ఉంది. అయితే వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరూ టీడీపీకే ఓటేస్తారా లేదా టీడీపీని వీడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.?