రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం: మోదీ

రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం: మోదీ

వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు.రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం: మోదీ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ -ప్రధాని నరేంద్ర మోదీ

రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.