ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా
వరంగల్ టైమ్స్, ముంబై: నేవీ డే సందర్భంగా ఆర్థిక రాజధాని ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు. 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు, 1400 కేజీల బరువుతో ఉన్న మువ్వన్నెల పతాకం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఖాదీతో తయారు చేసిన ఈ భారీ పతాకాన్ని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉంచారు.