చిన్నజీయర్ స్వామిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..!
వరంగల్ టైమ్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆదివాసీల వనదేవత సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చిన్నజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర తెలియని జీయర్‌స్వామికి వారి గురించి మాట్లాడే హక్కు లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర తెలిపారు. కులపిచ్చితో జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చినజీయర్‌దని విమర్శించారు. అడవి బిడ్డలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన జీయర్‌స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.