బూస్టర్ డోసు తప్పనిసరి : మంత్రి హరీష్ రావు

బూస్టర్ డోసు తప్పనిసరి : మంత్రి హరీష్ రావు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో దాగుందని అన్నారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.బూస్టర్ డోసు తప్పనిసరి : మంత్రి హరీష్ రావుచైనా సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవడం అవసరమని మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. త్వరలో తెలంగాణలో అవసరమైతే డోసులు పంపిణీ చేస్తుందని ఆశిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు.