ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ సారీ చెప్పాలి: కీర్తి రెడ్డి

ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ సారీ చెప్పాలి: కీర్తి రెడ్డి

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం శుభపరిణామమేనని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. అయినప్పటికీ, గత మూడేళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు అనుభవిస్తున్న మానసిక క్షోభకు సీఎం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కీర్తి రెడ్డి ప్రశ్నించారు. భూపాలపల్లి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ సారీ చెప్పాలి: కీర్తి రెడ్డిగత మూడు సంవత్సరాల కింద కేసీఆర్ ఇదే ఫీల్డు అసిస్టెంట్లను దొంగలు అంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని, వాళ్లు అవినీతి పరులు అంటూ నిండు సభలో అగౌరవ పరిచి చేతగాని వాళ్ళు అని చెప్పి వాళ్లను విధుల నుంచి తీసివేయడం బాధాకరమన్నారు. ఆరోజు అవినీతి ఆరోపణలు మోపినందుకు చాలా మంది జాబులు కోల్పోయినందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవాళ మళ్లీ అదే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తారో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కీర్తి రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ లను తక్షణమే విధుల్లోకి తీసుకుని నిండు సభలో వాళ్లందరికీ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాలుగా వారు నష్టపోయినా వేతనాన్ని అందించాలి. ఆత్మహత్యకు పాల్పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్ ల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. కేసీఆర్ కు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చందుపట్ల కీర్తి రెడ్డి హితవు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కన్నం యుగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గణపతి, పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, రాంరెడ్డి,కోరె సుధాకర్, నాంపల్లి కుమార్,బూర పద్మ,వేశాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.