16614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ  

16614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 587 ఎస్సై పోస్టులున్నాయి.

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. మే 2 నుంచి మే 20 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు తదితర వివరాల కోసం www.tslprb.inవెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.16614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ  ఎస్సై పోస్టుల వివరాలు :
సివిల్ ఎస్సైలు 414
ఏఆర్ ఎస్సైలు 66
ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సైలు -05
టీఎస్ఎస్పీ ఎస్సైలు -23
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్సైలు -12
ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సైలు -22
పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ -03
ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్సైలు -08
విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ -26
జైళ్ల శాఖ -08

కానిస్టేబుల్ పోస్టుల వివరాలు :
సివిల్ కానిస్టేబుల్స్ -4965
ఏఆర్ కానిస్టేబుల్స్ –4423
ఎస్ఏఆర్ సీఎల్ –100
టీఎస్ఎస్పీ –5010
స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ -390
విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ -610
ఐటీ, కమ్యూనికేషన్ -262
జైళ్ల శాఖ ( పురుషులు) -136
జైళ్ల శాఖ ( మహిళలు ) -10
పోలీస్ కానిస్టేబుల్ ( డ్రైవర్ ) -100
పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ ) -21