ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. నైరోబి నుంచి హైదరాబాద్ వచ్చిన మలావియన్ దేశస్తురాలి నుంచి 3.129 కిలోల హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు నైరోబి నుంచి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా మీదుగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు.పట్టుబడిన హెరాయిన్ విలువ దాదాపు రూ. 22 కోట్లు ఉంటుందని వెల్లడించారు. సూట్ కేస్ అడుగు భాగంలో హెరాయిన్ దాచి తెచ్చినట్లు తెలిపారు. డీఆర్ఐ అధికారులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్ ను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.