18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలుహైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల విడుదలకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రశ్నపత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది. స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కాగా,  గతేడాది తలెత్తిన సమస్యలు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన ప్రక్రియను మరోసారి పునః పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి కానుంది. మొత్తానికి ఈనెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.