కేటీపీపీలో భారీ పేలుడు..ఏడుగురికి గాయాలు  

కేటీపీపీలో భారీ పేలుడు..ఏడుగురికి గాయాలు

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ప్లాంట్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ఉద్యోగులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు కేటీపీపీ ఉద్యోగులున్నారు. మిగతా ఐదుగురు కార్మికులు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కేటీపీపీలో భారీ పేలుడు..ఏడుగురికి గాయాలు  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్ లో కోల్ పంపించే మిల్లులో ఉన్నట్లుండి మిల్లర్ పేలింది. ఈ పేలుడు కారణంగా ప్లాంట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో మంటలను అదుపు చేసే చర్యలను అధికారులు చేపట్టారు.

గాయపడిన వారిలో ఒకరు ఆర్టిజన్ ( బెల్ట్ మీద బొగ్గు సేకరించే పని), ఒకరు జేపీఏ ఉన్నారు. మరో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటో యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది. 6 మిల్లర్లు క్రషర్ అవుతాయని, ఐతే ఒక్కసారిగా ఎయిర్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.