చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ 

చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాట్స్ మెన్లు ముంచేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఊతప్ప (1), శాంట్నర్ (9), శివమ్ దూబే (8) పూర్తిగా విఫలమయ్యారు. ఐతే రుతురాజ్ గైక్వాడ్ (30) కాస్త ఫర్వాలేదనిపించాడు. తర్వాత వచ్చిన అంబటి రాయుడు (78) జట్టును గెలిపించడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా ( 21 నాటౌట్) భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యాడు. దీంతో రాయుడిపై తీవ్రమైన ఒత్తిడి పడింది.చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడబోయిన అతను పెవిలియన్ చేరాడు. ఇలాంటి టైంలో క్రీజులోకి వచ్చిన ధోనీ(12) కొంత ఆశలు కల్పించాడు. అయినప్పటికీ, చివరి ఓవర్లో అతను కూడా భారీ షాట్ ఆడే క్రమంలో వికెట్ కోల్పోయాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ మాత్రమే చేయగల్గింది. విక్టరీకి 11 రన్స్ దూరంలో చతికిలపడింది. పంజాబ్ బౌలర్లలో రబాడ, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.