వరంగల్ నుంచే ‘జయమ్మ పంచాయతీ’ యాత్ర

వరంగల్ నుంచే ‘జయమ్మ పంచాయతీ’ యాత్ర

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : జయమ్మ పంచాయతీ సినిమా బృందం హనుమకొండ, వరంగల్ నగరాల్లో సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా యాంకర్ సుమ హనుమకొండలో పర్యటించింది. బుల్లితెరపై 14 యేండ్లుగా యాంకర్ గా సందడి చేసిన తనకు సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘జయమ్మ పంచాయతీ’ సినిమా ప్రమోషన్ లో చరిత్ర ప్రసిద్ధి గాంచిన, కోరిన కోర్కెలు తీర్చే భద్రకాళి అమ్మవారిని ‘జయమ్మ పంచాయతీ’ సినిమా టీం దర్శించుకున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయ సన్నిధి నుంచే తన సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టింది సుమ కనకాల.వరంగల్ నుంచే 'జయమ్మ పంచాయతీ' యాత్రతన సినిమా బిగ్ హిట్ కొట్టాలని, భద్రకాళి అమ్మవారికి చిట్టీలో రాసి మరీ తన కోర్కెను బలంగా కోరుకున్నానని సుమ కనకాల తెలిపారు. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన జయమ్మ టీం మీడియా సమావేశంలో సుమ మాట్లాడారు. భద్రకాళి అమ్మవారిని మొట్టమొదటి సారిగా దర్శించుకున్నానని, అది కూడా చరిత్ర కల్గిన ఓరుగల్లు జిల్లా నుంచే తన సినిమా ప్రమోషన్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సుమ తెలిపారు.

సినిమాలో తనకు అవకాశం వచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చిన బుల్లితెరను తాను ఎప్పుడూ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇక జయమ్మ సినిమా అనేది శ్రీకాకుళం జిల్లా యాసతో కూడిన ఓ వాస్తవిక కథాంశమని అన్నారు. ఇది ప్రజల వాస్తవికతకు చేరువలో ఉంటుందని అన్నారు.

 

స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత సుమ వెండితెరపై కనిపించనున్నారు. సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయతీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో జయమ్మగా సుమ తన నటనతో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ‘జయమ్మ పంచాయితీ’ ని విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయతీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.