ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక గొప్ప దర్శకుడి కల : ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక గొప్ప దర్శకుడి కల : ఎన్టీఆర్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఆర్ఆర్ఆర్ సినిమా అనేది కేవలం ఒక సినిమా కాదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ కేవలం ఒక సినిమా కాదు, రీజనల్ సినిమాల బారియర్స్ ను తుడిపి వేసిన తన చిత్రాల ద్వారా భారతదేశ యూనిటీని కలపాలనుకునే ఒక గొప్ప దర్శకుడి కల. ఈ చిత్రం రాబోయే తరాలకు నిదర్శనం కాబోతుంది. ఇటువంటి ఆ చిత్రంలో నాకు కూడా ఒక భాగం అవకాశం కల్పించినందుకు జక్కన్నకు థాంక్స్ అని ఎన్టీఆర్ వేదికపై తెలిపారు. ఈ సినిమాకు పనిచేసినటువంటి ఎంతో మంది సాంకేతిక నిపుణులున్నారు. ఈ సినిమాను ఒక మైలురాయిగా తీర్చిదిద్దాల్సిందిగా ఎన్టీఆర్ అందరిని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక గొప్ప దర్శకుడి కల : ఎన్టీఆర్తన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు తన అభిమానులేనని జూ.ఎన్టీఆర్ అన్నారు. నేడు ఫ్యాన్స్ అభిమానంతో పాటు తన బ్రదర్ చరణ్ అభిమానులు కూడా తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడూ ఇలాగే ఆనందంగా అభిమానులు ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. మీరు ఎంత సఖ్యతతో ఉంటే ఇంకా గొప్ప సినిమాలు వస్తాయన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు తాను పాదాభివందనాలు చేస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ముగించే ముందు చరణ్ గురించి చెప్పాలంటూ దేవుడని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలన్నారు. చరణ్ తో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, తమ మధ్య స్నేహబంధం దిష్టి తగలకుండా ఇలాగే కొనసాగాలని ఆ దేవుడిని కోరుకుంటూ, చరణ్ ఎప్పుడూ తన పక్కనే ఉండాలని తారక్ స్పష్టం చేశారు.