తమిళ అమ్మాయిని పెళ్లాడిన ఆస్ట్రేలియా క్రికెటర్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్, ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మాక్సీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ లతో పంచుకున్నాడు. కాగా భారత సంతతికి చెందిన వినీ రామన్, గ్లెన్ మాక్స్ వెల్ గత కొద్ది రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. పైగా వీరిద్దరి కుటుంబసభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మాక్స్ వెల్ పెళ్లి పీఠలు ఎక్కాడు. గ్లెన్ మాక్స్ వెల్ పెళ్లి సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించింది. గ్లెన్ మాక్స్ వెల్-వినీ రామన్ లకు శుభాకాంక్షలు తెలిపింది.అలాగే గ్లెన్ మాక్స్ వెల్-వినీ రామన్ జంట తమ మ్యారేజ్ ఫోటోను కూడా అభిమానులతో పంచుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నగ్లెన్ మాక్స్ వెల్-వినీ రామన్ లకు ఆల్ ది బెస్ట్ అని రాసుకువచ్చింది. కాగా గ్లెన్ మాక్స్ వెల్ సతీమణి తమిళనాడు సంతతికి చెందినది. కాబట్టి తమ తమిళంలో ప్రింట్ చేసిన పెళ్లి పత్రికను కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.