మంత్రి అమర్నాథ్‌ కోడిగుడ్డు కథ విన్నారా?

మంత్రి అమర్నాథ్‌ కోడిగుడ్డు కథ విన్నారా?

మంత్రి అమర్నాథ్‌ కోడిగుడ్డు కథ విన్నారా?

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : నగరంలో ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహణ గర్వకారణమని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి నిర్మించిన హైదరాబాద్‌ నగరానికి ఫార్ములా ఈ రేస్‌ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ ఈ స్థాయికి చేరడానికి తెలంగాణతో పాటు తెలుగు ప్రజల కృషి కూడా ఉందన్నారు. ఈ రేస్‌ను మంత్రి అమర్నాథ్‌ తిలకించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి రేస్‌లు ఎప్పుడు నిర్వహిస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి విచిత్రమైన సమాధానమిచ్చారు.

‘‘కోడి గుడ్డు పెట్టగలదు.కానీ, కోడి..కోడిని పెట్టలేదుగా? కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో కోడి గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్‌ పడుతుంది’’ అంటూ విచిత్రమైన పోలికతో జవాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహించే స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.