వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ. 56,754 వద్ద స్థిరపడింది. గురువారం ముగింపుతో పోల్చితే రూ.669 క్షీణించింది. నాడు రూ. 57,423 వద్ద ఉన్నది. గ్లోబల్ ట్రెండ్స్ బలహీనంగా ఉండలం వల్లనే ధరలు పడిపోయాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 10 గ్రాములు రూ. 57,160 గా ఉన్నంది. రూ. 550 తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ రూ. 52,400 పలికింది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీ ఎత్తున దిగజారింది. ఢిల్లీలో కిలో ధర రూ. 1,026 పడిపోయి రూ.66,953 వద్ద ఉన్నది. హైదరాబాద్ లో రూ.1000 క్షీణించి రూ. 72,500 పలికింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో జౌన్స్ గోల్డ్ ధర 1,866 డాలర్లుగా, వెండి ధర 22.12 డాలర్టుగా ఉంది.