యాదాద్రికి ఎమ్మెల్యే గాదరి కిషోరం గోల్డ్ విరాళం 

యాదాద్రికి ఎమ్మెల్యే గాదరి కిషోరం గోల్డ్ విరాళం

వరంగల్ టైమ్స్, యాదాద్రి : యాదాద్రి లక్ష్మీ నరసింహుడి ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ భారీ విరాళం సమర్పించారు. తుంగతుర్తి నియోజకవర్గం తరపున 1,330 గ్రాములు, ఎమ్మెల్యే కుటుంబం తరపున 250 గ్రాములు, మొత్తంగా ఒక కేజీ 580 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే గాదరి కిషోర్ సోమవారం విరాళంగా అందించారు.యాదాద్రికి ఎమ్మెల్యే గాదరి కిషోరం గోల్డ్ విరాళం బాలాలయంలో మొదటగా పూజలు చేసినే అనంతరం ఆలయ ఈఓ గీతకు బంగారం అందచేశారు. అర్చకులు ఆశీర్వదించి ఎమ్మెల్యే కిషోర్ కుటుంబసభ్యులకు వేద ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక దంపతులు, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ గుప్త తదితరులున్నారు.