ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ప్లేయర్లు అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ప్లేయర్లు అరెస్ట్

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ గురించి విశ్వసనీయ సమాచారంపై టాస్క్ ఫోర్స్ బృందం 05 మంది వ్యక్తులను వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని రిషి బార్ వద్ద పట్టుకుంది. ఇంతేజార్‌గంజ్ పరిధిలో బార్‌లో టీవీ చూస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేసి నిందితులు అరెస్టు చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ప్లేయర్లు అరెస్ట్అరెస్ట్ అయిన వారిలో వరంగల్ జిల్లా కాశీబుగ్గ వివేకానంద కాలనీకి చెందిన పగడాల ప్రశాంత్ (25సం.) తండ్రి మహేందర్ , స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిన్న పెండ్యాలకు చెందిన గాదె విశ్వ ( 22 సం.) తండ్రి మురళి, కరుణాపురంకు చెందిన మట్టెడ మనోహర్ (27 సం.) తండ్రి దేవయ్య, నష్కల్ కు చెందిన కొరివి ప్రణయ్ (22 సం.) తండ్రి సంపత్ , చిల్పూరు మండలం నష్కల్ కు చెందిన మానుకోట శ్రీకాంత్ (27సం.) తండ్రి రాములు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఇక రిషి బార్ అండ్ రెస్టారెంట్ యజమాని మహేందర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ. 64వేల 250 లు, 6 మొబైల్ ఫోన్లు, నం.TS03EE3108 గల ఒక మోటార్ సైకిల్ వీడియో బేరింగ్ లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషినల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు.