కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పోచారం పూజలు

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పోచారం పూజలు

వరంగల్ టైమ్స్, కామారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అనారోగ్యం నుండి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మృత్యుంజయ హోమం నిర్వహించారు.కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పోచారం పూజలుబాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారు తెలంగాణ తిరుమల దేవస్థానము (TTD)శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు హోమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా దేవాలయంలో ప్రత్యేకంగా మృత్యుంజయ హోమం నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహముతో కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై రాష్ట్రానికి, దేశానికి తమ సేవలను అందించాలని ప్రార్థించినట్లు స్పీకర్ పోచారం తెలిపారు.