100 లైబ్రరీలలో అందుబాటులో స్టడీ మెటీరియల్

100 లైబ్రరీలలో అందుబాటులో స్టడీ మెటీరియల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలోని 100 లైబ్రరీలలో పోటీ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయి మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ , శాఖ అధికారులతో కలిసి మంత్రి కార్యాలయంలో సమీక్షించారు.100 లైబ్రరీలలో అందుబాటులో స్టడీ మెటీరియల్ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన 100 లైబ్రరీలలో ఈ మేరకు పూర్తి స్థాయి పుస్తకాలను అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాలలో ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలన్నారు. రాష్ట్రంలోనే మొదటగా వికారాబాద్ జిల్లా లైబ్రరీ లో ఈ నెల 31 న యువత కు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.