ఐపీఎల్ లో ముంబైకి మూడో ఓటమి

ఐపీఎల్ లో ముంబైకి మూడో ఓటమి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ముంబైకి ఈ ఐపీఎల్ లో వరుసగా మూడో పరాజయం ఎదురైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు సూర్యకుమార్ యాదవ్ ( 52), తిలక్వర్మ ( 38 నాటౌట్ ), డెవాల్డ్ బ్రెవిస్ ( 29), కీరన్ పొలార్డ్ ( 5 బంతుల్లో 22 నాటౌట్ ) రాణించడంతో 20 ఓవర్లకు 161 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ ను మిల్స్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. రహానే ( 10)ను షార్ట్ బాల్ తో బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ( 10), శామ్ బిల్లింగ్స్ ( 17), నితీష్ రాణా (8), ఆండ్రీ రస్సెల్ (8) వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ కు క్యూ కట్టడంతో కేకేఆర్ ఓడిపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు.ఐపీఎల్ లో ముంబైకి మూడో ఓటమివెంకటేశ్ అయ్యర్ ( 50 నాటౌట్ ) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. అయితే రస్సెల్ ఔటైన తర్వాత ఈ ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచే బౌండరీని లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈక్రమంలోనే కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అదే ఊపులో 16వ ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్ తో కోల్ కతాకు విజయాన్ని కట్టబెట్టాడు. ముంబై బౌలర్లలో టైమల్ మిల్స్, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. డానియెల్ శామ్స్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.