యువకుడి కడుపులో బయటపడిన కొకైన్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న విదేశీయుడిని అరెస్ట్ చేశారు. జోహాన్స్బర్గ్ నుండి శంషాబాద్ వచ్చిన టాంజానియా దేశస్థుడు నుండి రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ ను అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో 1,157 గ్రాముల కొకైన్ స్వాధీనం చరేసుకున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ కు కొకైన్ తరలిస్తున్నట్లు సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఆప్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. కొకైన్ ను మాత్రల రూపంలోకి కడుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 79 క్యాప్సూల్స్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువకుడిని హాస్పిటల్ కు తరలించిన అధికారులు వైద్యులు యువకుడి కడుపులో ఉన్న మొత్తం క్యాప్సుల్స్ బయటకు తీశారు.