గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల

గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సారి గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ నేడు విడుదల చేసింది. మొత్తం 503 ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 2 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31న ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలఅభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లలో పేర్కొంది. గ్రూప్-1 లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల గ్రూప్-1 కు సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో కేవలం 900 మార్కులకే మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి డిటైయిల్డ్ నోటిఫికేషన్ ను ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే మే 2న విడుదల చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
మండల పరిషత్ అభివృద్ధి అధికారి -121
జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు -5
డీఎస్పీ -91
జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు -2
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు -40
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు -5
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ -20 ( పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ )
సీటీఓ -48
డిప్యూటీ కలెక్టర్లు -42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ -26
ప్రాంతీయ రవాణా అధికారి -4
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ -8
జిల్లా ఉపాధి అధికారి -2
జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి పోస్టులు -6
గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు -35