తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా నందికొండ 

తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా నందికొండ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా నందికొండ నర్సింగరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నర్సింగరావు నల్లగొండ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా నందికొండ తెలంగాణ హైకోర్టు ప్రతిపాదనల ప్రకారం తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా నర్సింగరావును నియమిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పదవిలో నర్సింగరావు సంవత్సరం పాటు కొనసాగనున్నారు.