జూన్ 1 నుంచి బడి బాట : సబితా ఇంద్రారెడ్డి  

జూన్ 1 నుంచి బడి బాట : సబితా ఇంద్రారెడ్డి

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : జూన్ 1 నుంచి 12 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా జూన్ 12న పాఠశాలలను పున:ప్రారంభిస్తామని తెలిపారు.జూన్ 1 నుంచి బడి బాట : సబితా ఇంద్రారెడ్డి  తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పాఠశాలల బాగుకు సర్పంచ్ లు చొరవ తీసుకోవాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు కలిసి రావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఆట స్థలాలున్న పాఠశాలలకు క్రీడా సామాగ్రి ఇస్తామని పేర్కొన్నారు. ఐటీ, డిజిటల్ అంశాలపై మంత్రి కేటీఆర్ చేసిన సూచనలను పరిశీలిస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.