మే మొత్తం కార్మిక చైతన్య మాసోత్సవాలు : దాస్యం

మే మొత్తం కార్మిక చైతన్య మాసోత్సవాలు : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనాతీరుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హనుమకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకురావడమే కాకుండా, కార్మిక వ్యతిరుక విధానాలు అమలుపరుస్తూ సంఘటిత, అసంఘటిత కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో కార్మికులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మే మొత్తం కార్మిక చైతన్య మాసోత్సవాలు : దాస్యంఓరుగల్లు చైతన్యవంతమైన గడ్డ అని తెలిపారు. ఇక్కడ ఏ పోరాటం మొదలు పెట్టినా గమ్యాన్ని ముద్దాడటం ఖాయమని చీఫ్ విప్ దాస్యం స్పష్టం చేశారు. మే 1 నుంచి నెల రోజుల పాటు కార్మిక చైతన్య మాసోత్సవం జరపాలని నిర్ణయించినట్లు దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులతో కలిసి కార్యాచరణఏ చేపట్టనున్నామని తెలిపారు. మే 30న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.