ఆ పరీక్షల ఫీజు చెల్లింపుకు తత్కాల్ స్కీం 

ఆ పరీక్షల ఫీజు చెల్లింపుకు తత్కాల్ స్కీం

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) శనివారం తత్కాల్ స్కీంను ప్రకటించింది. 2021-2022 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ కోర్సులో ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు, అంతకు ముందు ఫెయిలైన అభ్యర్థులు, పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులైనప్పటికీ పరీక్ష రుసుం సకాలంలో చెల్లించలేని అభ్యర్థులు ఇప్పుడు మే 1 నుంచి 7 వరకు చెల్లించవచ్చు.ఆ పరీక్షల ఫీజు చెల్లింపుకు తత్కాల్ స్కీం తత్కాల్ స్కీం కింద సాధారణ ఫీజుకు అదనంగా ఎస్సెస్సీకి రూ. 500, ఇంటర్మీడియట్ కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సంబంధిత స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ ను సంప్రదించవచ్చు.