టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీంఇండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీంఇండియాస్పోర్ట్స్ డెస్క్ : సౌతాఫ్రికాతో మూడో టెస్టులో గెలుపే లక్ష్యంగా టీంఇండియా బరిలోకి వెళ్లేందుకు రెడీ అయింది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ మూడో టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విహారి స్థానంలో తాను వచ్చినట్లు వెల్లడించారు. అలాగే గాయం కారణంగా సిరాజ్ ఆడటం లేదని, అతని స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇషాంత్, ఉమేశ్ లలో ఎవరిని తీసుకోవాలని చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

ఇటీవలి కాలంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, టీం ఇండియాకు బలమైన బెంజ్ సామర్థ్యం ఉందని కొనియాడాడు. అదే సమయంలో ఇది తమకు అతి ముఖ్యమైన మ్యాచ్ అని సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్ అన్నాడు. అంతకుముందు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. గత 10-15 యేండ్లలో ఇది తమకు అత్యంత కీలకమైన మ్యాచ్ అని అభిప్రాయపడ్డాడు.

టీంఇండియా : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషభ్ పంత్, రవిచంత్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.

సౌతాఫ్రికా : డీన్ ఎల్గార్, ఎయిడెన్ మార్క్రమ్, కీగన్ పీటర్సన్, రాసీ వాన్ డర్ డస్సెన్, టెంబా బవుమా, కైల్ వేరెన్నె, మార్కో జాన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, డువాన్నె ఆలివియర్, లుంగి ఎన్గిడీ.