అమరావతి : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వైఎస్ జగన్ కు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరుగనున్నాయి. సీఎం జగన్ ను కలిసిన వారిలో స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.
Home News