తెలంగాణలో కానిస్టేబుళ్లకు పదోన్నతులు 

తెలంగాణలో కానిస్టేబుళ్లకు పదోన్నతులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : రాష్ట్ర పోలీస్‌శాఖలో కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఆర్‌ నుంచి సివిల్‌కు కన్వర్షన్‌ వివాదం కారణంగా మూడున్నరేళ్లుగా న్యాయస్థానంలో నానుతున్న సమస్యకు గత జనవరిలో పరిష్కారం లభించింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు చేపట్టిన కసరత్తు ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్రంలో హెడ్‌కానిస్టేబుళ్ల స్థాయిలో 3,300 ఖాళీలుండగా కొద్దిరోజుల క్రితమే 1,300 మందికి, తాజాగా మరో 1,600 మందికి హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించారు.