కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందన్నారు. శనివారం హనుమకొండలోని తన నివాసంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని 81 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 81 లక్షలపై చిలుకు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లావీరిలో గీసుగొండ మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులు, సంగెం మండలానికి చెందిన 17 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులను స్వీకరించారు. అనంతరం టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు వివరించారు.

కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఇంటింటికీ తాగు నీరు , కోటిన్నర ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు. చేపలు, గొర్రెలు, కోళ్ళు, బర్రెల పెంపకం పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాల ద్వారా ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్‌, ఏరోస్పేస్‌ రంగాలు మరింత దూసుకుపోతున్నాయని అన్నారు.

ఓకే దేశంలో వేరు వేరు విధంగా ధాన్యం కొనుగోలు చేయడం సిగ్గుచేటని బీజేపీ ప్రభుత్వంపై చల్లా ధర్మారెడ్డి ధ్వజమెత్తారు. పంజాబ్ తరహా తెలంగాణ రైతన్నలు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి కొనుగోలు విషయంలో ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.