క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ. 15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రైవేట్ సంస్థల పేరుతో ఆయా బ్యాంకుల్లో ఖాతాలను తెరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.