ఈడీ ముందు లొంగిపోయిన కెల్విన్

ఈడీ ముందు లొంగిపోయిన కెల్విన్హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే అనుమానం ఉన్న సినీ తారలకు ఈడీ సమన్లు పంపింది. మంగళవారం సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఐతే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్ గా మారినట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది.

అప్పుడు ఎక్సైజ్ అధికారుల ముందు నోరు విప్పని కెల్విన్ ..ఈడీ ముందు అప్రూవర్ గా మారి సినీతారల చిట్టా విప్పాడు. అతని స్టేట్మెంట్ ఆధారంగానే సినీ తారలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నిందితుడు కెల్విన్ అకౌంట్ లోకి భారీగా నిధులను బదిలీ చేశారు సినీ తారలు.

అయితే ఇప్పటికే కెల్విన్ అకౌంట్ ని ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇక ఈ కెల్విన్ అకౌంట్ ఆధారంగా అతనికి ఎవరెవరు డబ్బులు పంపించారో ఆ సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే ఆలోచనలు ఈడీ చేస్తున్నట్లు తెలుస్తుంది.