దుర్గ‌మ్మ‌కు బంగారు నెమ‌లి హారం బ‌హూక‌ర‌ణ‌

దుర్గ‌మ్మ‌కు బంగారు నెమ‌లి హారం బ‌హూక‌ర‌ణ‌విజయవాడ : ఇంద్ర‌కీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు అలంక‌ర‌ణ నిమిత్తం కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన విశాలాక్షి కుటుంబ సభ్యులతో కలిసి 132 గ్రాములు బరువున్న‌ బంగారు నెమలి హారాన్ని, 29.8గ్రాముల బరువున్న‌ బంగారు నగిషీ గజలక్ష్మీ లాకెట్‌ను ఆలయ ఈవో డి.భ్రమరాంబను క‌లిసి బుధ‌వారం అంద‌జేశారు.

అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ స‌భ్యుల‌కు అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.